calender_icon.png 10 November, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

10-11-2025 05:35:50 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. సోమవారం మండల కేంద్రంలోని  విద్య వనరుల  కేంద్రంలో మండల విద్యాధికారి శ్రీదేవి సమక్షంలో ఉత్తమ ఉపాధ్యాయులకు  అవార్డులను  ప్రధానం చేశారు.  విద్యార్థుల సంఖ్యను పెంచిన ఉపాధ్యాయులను, అందరినీ సమన్వయం చేస్తూ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తూ, విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను 12 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో  అశోక్ కుమార్, వేణుగోపాల్, దేవ్, మోహన్, బొజ్య నాయక్, అనిల్ కుమార్, రఘునందన్, సంపత్, భగవాన్ రెడ్డి, సత్యనారాయణ, వరప్రసాద్, రాజేశ్వరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  సోమలింగం, సునీల్, శైలజ,  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, సుదర్శన్, సురేష్ పాల్గొన్నారు.