calender_icon.png 10 November, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయ కళల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

10-11-2025 05:23:35 PM

కుమ్మరి శంకర్..

నకిరేకల్ (విజయక్రాంతి): సాంప్రదాయ కళల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని.. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ కోరారు. సోమవారం శాలిగౌరారం మండల కేంద్రంలో ప్రజానాట్యమండలి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన భారతీయ సంస్కృతిని నేటి విష సంస్కృతి కబళిస్తోందని ఆయన  పేర్కొన్నారు.. వృత్తి సాంప్రదాయాలు, జానపద కళారూపాలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఈ కళలే ఆధారంగా బతుకుతున్న అనేక కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సాంప్రదాయక కళలను ప్రోత్సహించి, ఆదరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించాయని తీవ్రంగావిమర్శించారు.కళాకారుల కష్టాలు తగ్గించేందుకు పెన్షన్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం వంటి సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలనే ప్రాతిపదికగా చేసుకొని ప్రజానాట్యమండలి చైతన్య పూరిత పాత్ర పోషిస్తోంది. కళ కాసుల కోసం కాదు - కళ ప్రజల కోసమే అన్న నినాదంతో  ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.ఇన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడి ప్రజల మధ్య చైతన్యం నింపుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బట్ట రామచంద్రు, నాయకులు ఎర్ర శీను, గద్దపాటి రాము, దాసరి శంకర్, నిమ్మల రవి, అలాగే ప్రజాసంఘాల ప్రతినిధులు చలకాని మల్లయ్య, డెంకెల లింగయ్య, రావుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.