10-11-2025 04:19:47 PM
టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తులసి ఆగమయ్య
ధర్మపురి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా కవి, వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర గీత ఆవిష్కర్త అందెశ్రీ ఆకస్మిక మరణం తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి, కళా రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి తులసి ఆగమయ్య అన్నారు. అందెశ్రీ మరణ వార్త తెలియగానే వెల్గటూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల పైడిపల్లిలో స్కూల్ అసెంబ్లీలో ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆయన చేసిన కృషి అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.