calender_icon.png 10 November, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు 'అను' ఎంపిక

10-11-2025 05:26:16 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని జి అను రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైందని కాలేజీ ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (అండర్ 17 విభాగం) పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారిణి నల్గొండ జిల్లాలో ఈ నెల 14, 15, 16, 17 తేదీలలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొంటుందని తెలిపారు. రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని పీడీ చిన్నక్క కోచ్ సురేందర్ లు అభినందించారు.