10-08-2024 03:23:42 AM
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు నెలలుగా ఆరాచక పాలన సాగుతోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ గుండాలు హత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హత్యలు చేసిన వారికే కాదు, చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దాడులకు, హత్యలకు మద్దతు ఇస్తున్న వారిని ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రం లో లా అండ్ ఆర్డర్ బతకదని ఆవేదన వ్యక్తంచేశారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ఎదుట సుబ్బా రాయుడి హత్య జరగడం బాధాకరమని, ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకో ర్టుకు వెళ్తాతామని, మా కార్యకర్తలందరినీ రక్షించుకుంటామని, పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పాన ని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.