calender_icon.png 15 July, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతనం వైపు ప్రపంచం చూపు

10-08-2024 01:50:55 AM

నేడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘా లు కమ్ముకున్నాయి. ప్రపంచంలో శాంతి, ధర్మం నెలకొనాలంటే సహనం ఎంతో అవసరం. సనాతన ధర్మాన్ని మించిన సహనం మరొకటి లేదు. భారతీయ సంస్కృతి, నాగరికతను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. యువతరం శ్రీరాముడు చూపిన బాటలో నడిచి భారతమాత కీర్తి ప్రతిష్ఠలను పెంచాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. మనదేశ సనాతన ధర్మం కారణంగానే ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోందిఅని స్వామి అభిషేక్ బ్రహ్మచారి అన్నారు. 

ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వేదికగా శ్రీవిద్యా కోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతోంది. ఈ సంద ర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి విజయక్రాంతితో ముచ్చటించారు. ఆ విశేషాలే ఇవీ.. - శ్రీరాముడి ఆశీస్సులతో భారత్‌లో రామరాజ్యం బలపడుతోంది. సంస్కృత భాషాభివృద్ధికి భారతీయులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడం కర్తవ్యంగా భావించాలి. పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎంతోగానూ కృషి చేస్తున్నారు.

దేశంలో శాంతిని పెంపొందించడానికి అనేక ముఖ్య నగరాల్లో కోటి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలను నిర్వహించాం. 10వ మహా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబా ద్ స్కందగిరి మఠంలో సుబ్రమణ్యస్వామి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించ బోతున్నాం. ఈ కార్యక్రమాలు ఈనెల 11 నుంచి 13 వరకు జరుగుతాయి. కుంకుమార్చనలో భాగంగా ఇందులో లలితా త్రిపుర సుందరి దేవి పేర్లను కోటి సార్లు పఠించడంతో పాటు ఖీర్‌తో చేసిన నైవేద్యాలను సమర్పిస్తాం. ఈ మహా క్రతువులో సాధువులు, ఆచార్యులు, వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

మండల పూజ, భక్తి కల్చరల్ కార్యక్రమాలు, పూర్హాహుతి, భగవతీ రాజోపచార పూజతోపాటు ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలతో ఆదిశంకరాచార్యస్వామి, మహా సాధువుల జీవితాలపై ఉపన్యాసాలు ఉంటాయి. కుంకుమార్చనను చిత్తశుద్ధితో నిర్వహించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. దేవతల చల్లని చూపు భక్తులపై పడుతుంది. కుంకుమార్చన తరతరాలుగా వస్తున్న పురాతన సంప్రదాయం. ప్రజలు తమ సాంస్కృతిక లో భాగంగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కుంకుమ అర్చనను సమర్పించడం దేవతలకు గౌరవం లాంటిది. అందుకే వివాహాది శుభకార్యాల సమయంలో అమ్మవా రికి కుంకుమార్చన చేయిస్తారు.

 స్వామి అభిషేక్ బ్రహ్మచారి