పురాతన కట్టడాలు, బావులను వారసత్వ సంపదగా గుర్తించాలి
మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
షాద్ నగర్, జూలై 2 (విజయక్రాంతి): చారిత్రక కట్టడాలు, పురాతన బావులను ప్రభుత్వం రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. గురువారం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామాన్ని సందర్శించిన ఆయన, అక్కడి చారిత్రక ఆనవాళ్లపై మీడియాతో మాట్లాడారు.పాపిరెడ్డిగూడలోని కట్టడాల పరిరక్షణపై గతంలో పురావస్తు శాఖకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, గ్రామంలోని సర్వే నంబర్ 227/1 లో గల 4.32 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, దీనిపై అధికారులు సరైన రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రస్తుత ఫరూక్నగర్ పరిధిలోని రాజుల కాలం నాటి నాలుగు పురాతన మంచినీటి బావులను పురావస్తు శాఖ హెరిటేజ్ కింద గుర్తించి, పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.






