3 July, 2026 | 2:15 AM

ఘనంగా బ్రహ్మోత్సవాలు

03-07-2026 12:18 AM

కేసముద్రం, జూలై 2 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం శ్రీ భూనీలాసమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవమ వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీమాన్ హేమంత ఆచార్యుల బృందం, ఆలయ ప్రధాన అర్చకులు వినయ్ మిశ్రా ఆధ్వర్యంలో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం సేవా కాలం శాత్తుముఱైయ్, ద్వజరోహనం,(సంతానార్థులకు గరుడ ప్రసాదం) అగ్ని ప్రతిష్ఠ, చతుస్తానార్చన, వేదవిన్నపాలు, నిత్యపూర్ణహుతి, అనంతరం తీర్థ ప్రసాద గోష్టి, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, బేరి పూజ, దేవతా ఆహ్వానం, చతుస్తానార్చన, ఎదుర్కోలు ఉత్సవం, వేద విన్నపాలు, నిత్య పూర్ణహుతి, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు.