10-11-2025 04:14:05 PM
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.