09-09-2025 02:52:41 PM
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ కేసరి సముద్రం( Kesari Samudram) చెరువులో ఆంధ్ర జాలర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా పుట్టి, పడవలు, పొడవాటి భారీ వలల సహాయంతో చేపలు పట్టి అక్రమంగా ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రభుత్వం తమకోసం సబ్సిడీపై చేప పిల్లలను పంపిస్తే నిబంధనలకు విరుద్ధంగా చెరువులను మధ్య దళారీలు సొసైటీ పెద్దల అవతారంలో అర్రాస్ పాడి ఆంధ్ర జాలర్లకు అమ్ముకొని తమను చేపలను పట్టుకుని ఇవ్వడం లేదని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై గత కొంతకాలంగా నిజమైన మత్స్యకారులు పోరాటం చేస్తుండగా వారి పోరాటానికి ఫలితంగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్థానిక మత్స్యకారులే చిన్న వల్ల సహాయంతో చేపలు పట్టుకొని జీవనం సాగించాలని పెద్దవల్ల సహాయంతో ఇతరులను పట్టుకొని వద్దంటూ అర్రాజ్ పాటను నిషేధిస్తూ తీర్పు విలువరించింది. అయినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను కూడా స్థానిక పోలీసులు బేఖాతర్ చేస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చేపల పంపిణీని అడ్డుకుంటున్న కొంతమంది మత్స్యకారులపై తప్పుడు కేసులు బనాయిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మరో పక్క వార్తా కథనాలను రాస్తున్న జర్నలిస్టులపై కూడా మధ్య దళారీలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.