04-11-2025 12:26:25 AM
							అశ్వారావుపేట, నవంబర్ 3,(విజయక్రాంతి): తెలంగాణా రాష్ట్రం లో భవన నిర్మాణాలకు వాడేఇనుక ఓ ప్రధాన ఆదా య ఒనరుగా మారింది. ఇనుకకు మంచి డిమాండ్ ఉండటం. ఆంధ్రా లో ఉచితంగా ఇనుక దొరుకుతుండటంతో కొందరు దళారీలు ఆంధ్రా నుండి తెలంగాణాలోని వివిధ ప్రదేశాలకు ఇనుకను లారీలలో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అక్టోబరు నెలలో దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఇసుక లారీలు పోలీసులు పట్టుకొన్నారు. గతం లో కూడా సత్తుపల్లి, అశ్వారావుపేటలోను ఇనుక లారీలు పట్టుబడ్డాయి.
ఒక్కోలారీలో 30 నుండి 40టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రాలో ఉచితంగా పొందుతున్న ఇసుకను లారీలలో లోడు చేసుకొని ,తెలంగాణాలోని సత్తుపల్లి, ఖమ్మం, నల్గొండ హైదరాబాదు తదితర ప్రాంతాలకు ఇనుకను యదేచ్చగా తరలిస్తున్నారు. సత్తుపల్లి పరిసరాలకు చెందిన కొందరు దళారీలు ఈ ఇనుక రవాణాలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తుంది. బయటి ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుకను ఒక్కో లారీ ఇసుకను రూ.1.50లక్షల నుండి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నట్టుసమాచారం.
ఈ ఇసుకను ఆంధ్రా నుండి వయా ఆశ్వారావు పేట మీదుగ తెలంగాణాలోని వివిద ప్రాంతాలకు నిత్యం 200 పైగా లారీలలో రవాణా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇనుక రవాణా చేసే దళారీలు వాహనాల ముందు ప్రత్యేకంగా పైలెట్లగా కార్లను వినియోగిస్తున్నారు. పైలెట్ వాహనాలు ముందుగా వచ్చి వరిసరాలను పరిశీలించి, రావచ్చు అనిచెప్పిన తరువాతే వాహనాలు తెలంగాణాలోకి ప్రవేశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇసుక లారీలు గమ్యం చేరేంత వరకు పైలెట్ వాహనాలు ఇదే విదంగా ముందు వెళ్ళి అక్కడ పరిస్థితిని అంచనా వేస్తుంటారు,ఆంధ్రా లోని ఇనుక అశ్వారావుపేట మీదుగానే కాకుండా చింతలనూడి , మేడిశెట్టివారిపాలెం, స త్తువల్లి ప్రాంతాల మీదుగా వివిద ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భారీఎత్తున, లక్షల్లో జరిగే ఈ ఇనుక దందాకోసం రవాణాదారులు ఎక్కడకి అక్కడే ఇన్ఫార్మెర్ లవ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇనుకను యదేచ్చగా రవాణా చేసేందుకు ఆయా శాఖలకు సంబందించిన కొందరు ఉద్యోగులను ఆకట్టుకొని వారి అండదండల తో రవాణా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరి కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారాన్ని ప్రత్యకంగానో, పరోక్షంగానో తిసూకుంటున్నట్టు విశ్వననింయ సమాచారం.
పోలీసులకు అక్కడ కడ ఇసుక లారీలు పట్టుబడుతున్నప్పటికి అవన్నీ నామ మాత్రంగానే జరుగుతున్నాయ ని తెలుస్తుంది. రవాణా అయ్యే ఇసుక వాహనాలలో కేవలం ఒక్క శాతం మా త్రమే పట్టుబడుతున్నాయని, ఇసుక మాత్రం అక్రమంగా తరలిపోతునందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై నిఘాను పెంచి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ ఇసుక రవాణాల్లో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.
తెలంగాణాలో పల్లె ప్రాంతాలలో ఉన్న ఇనుక కారీలను అందుబాటులో లేక పోవడం, ఆంధ్రా నుండి తెలంగాణా రవాణాకు అవకాశం కలుగుతుంది.తెలంగాణా ఈ ప్రాంతాలలో స్థానికంగా ఉన్న ఇనుక క్వారీలను అందుబాటు లోకి తేవాలనే డిమాండ్ చేస్తున్నారు.ఏది ఏమైనా లక్షలాది రూపాయల లావా దేవీలు జరిగే ఇనుక వ్యాపారాన్ని నియం త్రణలోకి తెచ్చేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తం అవతుంది. అధికారుల వైఫల్యం కారణంగానే ఇనుక అక్రమ రవాణా యద్దేచగ సాగుతుందనే ఆరోప ణలు వెలబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి ఆంధ్ర ఇసుక తెలం గాణలో ప్రవేశించకుండా చర్యలు తీసుకొని ఇసుకసురుల చర్యలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.