calender_icon.png 4 November, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేఒక్కడు కేటీఆర్

04-11-2025 12:35:25 AM

జూబ్లీహిల్స్‌లో వన్ మ్యాన్ షో!

తండ్రి మరణంతో ప్రచారానికి దూరంగా హరీశ్‌రావు

-‘జూబ్లీహిల్స్’ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న కేటీఆర్

-కార్నర్ మీటింగ్, రోడ్ షోలతో క్యాడర్‌లో జోష్

-బాధిత వర్గాలకు భరోసా

-హైదరాబాద్ కేటీఆర్ కంచుకోట అని మరోసారి నిరూపించే యత్నం

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగం గా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ ప్రచారాన్ని ముం దుండి నడిపిస్తున్నారు. ఒకవైపు ప్రచారంలో అనుసరించాల్సిన వూహ్యాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, మరోవైపు కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో క్యాడర్‌లో జోష్ నింపు తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న బలమైన సంకేతాలను అటు ప్రజలకు, ఇటు ఇతర పార్టీలకు పంపుతున్నారు.

వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను మొదట్లో కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు నిర్వర్తించారు. ప్రచారం విస్తృతంగా కొనసాగుతున్న క్ర మంలో హరీశ్‌రావు తండ్రి మరణించారు.  దీంతో ప్రచారానికి హరీశ్‌రావు దూరం కావ డంతో ఉపఎన్నిక బాధ్యత కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. అంతాతానై ప్రచారాన్ని ముం దుండి నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ తర ఫున ప్రచారంలో వన్ మ్యాన్ షోను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గెలుపే లక్ష్యం గా ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తున్నారు. 

విస్తృత ప్రచారం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ యా పార్టీల నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి రోజురోజుకూ చేరికలు పెరుగుతున్నాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ, ఎంఐఎం, టీడీపీ పార్టీలను భారీ నా యకులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల నుంచి నాయకులను స్వయం గా కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు.

దీంతో బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతున్నది. దీనికితోడు అన్నివర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన మోసాన్ని అందరికీ స్పష్టంగా వివరిస్తున్నారు. ఒకవైపు చేరికలు, ప్రత్యేక సమా వేశాలను నెరపుతూనే, మరోవైపు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తు న్నారు.

ముఖ్యంగా డివిజన్ వారీగా కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటుచేసి బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీ తేడా లేకుండా జూబ్లీహిల్స్ ప్రజలతో మమేకమై బీఆర్‌ఎస్ గెలుపును పక్కా చేస్తున్నారు. ఇప్పటికే నవంబర్ 9వ తేదీ వరకు నియోజకవర్గంలో చేపట్టే రోడ్ షోల షెడ్యూల్ ప్రక టించారు. ఇందుకు ఆయా డివిజన్‌లో ర్యా లీలు నిర్వహించడం, రోడ్ షో నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. 

బాధితులకు అండగా..

కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్, బాధితులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి వారికి భరోసా ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పుతున్నారు. ఇందు లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా జీవితాలు కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు మద్దతు ప్రకటించారు.

స్వ యంగా ఆటో ప్రయాణించి వారి కష్టాలను తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించకపోతే మరింత దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుం దని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తక్షణమే స్పందించి బస్సులో ప్రయాణించి, ప్రయాణీకుల సమస్యలపై దృష్టి సారించారు. బస్సు భవన్‌ను ముట్టడించి బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీం తోపాటు హైడ్రా కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.

బాధితులతో కలిసి హైడ్రా అక్రమకూల్చివేతలపై పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రా కార ణంగా నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైన వారికి అండగా నిలుస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 

కేటీఆర్ కంచుకోట..

కేటీఆర్ చేస్తున్న ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల నమ్మకం రెట్టింపు అవుతున్నది. వ్మూహాత్మకంగా వ్యవహరిస్తూ జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. వాస్తవానికి బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను కేటీఆర్ కంచుకోటగా మార్చుకున్నారు. గతంలోనూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టిన ఘనత కేటీఆర్ సొంతం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచిన జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలు మాత్రం బీఆర్‌ఎస్ వెంటే నిలిచారు. ఎంఐఎం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌నే గెలిపించారు.

ఈ అంశంతో హైదరాబాద్‌పై కేటీఆర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టం గా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టా త్మకంగా తీసుకున్న కేటీఆర్, జూబ్లీహిల్స్‌లో గెలిచి హైదరాబాద్ తన కంచుకోట అని మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆరోగ్యం సహకరించక కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకపోయినా, అనివార్య కారణాలతో హరీశ్‌రావు ప్రచారానికి దూరమైనా అన్నీ తానై గులాబీ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి సీఎం, మంత్రులు, ఇతర నాయకులందరూ ప్రచారం చేస్తుంటే, బీఆర్‌ఎస్ నుంచి ఒకే ఒక్కడు కేటీఆర్ ప్రచార బాధ్యతలు చేపట్టి గెలుపు దిశగా సాగుతున్నారు.