04-11-2025 12:24:38 AM
							ఖమ్మం, నవంబరు 3 (విజయ క్రాంతి): సుడా (స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ముసాయిదా మాస్టర్ ప్లాన్ నోటిఫై చే సి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 6న నోటిఫై చేసిన ముసాయిదాకు అభ్యంతరాలను స్వీకరించేందుకు గ డువు నేటితో తీరనుంది. అయితే మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు అవసరమైన అవగాహనను ప్రజలకు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే వి మర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ముసాయిదాను ప్రవేశపెట్టామని నాయకులు, అధి కారులు ఓ ప్రకటన ఇచ్చి, మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను ఆన్లైన్లో మొక్కుబడిగా అందుబాటులోకి తీసుకువచ్చారే తప్పించి, సంబంధి త కార్యాలయంలో కనీసం ప్రచార చిత్రాలను కూడా ఏర్పాటు చేయలేదనే అసహ నం వ్యక్తం అవుతోంది. మాస్టర్ ప్లాన్ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? కలుగనున్న అసౌకర్యం ఏమిటి? రాబోయే ఇబ్బందేమి టి? వాటి పై అభ్యంతరాలు ఎలా వ్యక్తం చే యాలి? అనే విషయం గ్రామీణ ప్రజలకే కా దు పట్టణ ప్రజానీకానికి సైతం తెలియదనే అభిప్రాయం వినవస్తోంది.
మాస్టర్ ప్లాన్ ఆ మోదం పొందిన తర్వాత, అధికారులు చేపట్టబోయే చర్యలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయితే అప్పుడు ఏం చేస్తారని, అప్పు డు జరగబోయే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి?
అధికారుల అలసత్వం..
ఖమ్మం మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ మరియు కార్పొరేషన్ చుట్టూ ఉన్న వైరా, ఖమ్మం రూరల్, కూ సుమంచి, ముదిగొండ, చింతకాని, రఘునాథపాలెం మరియు కొణిజెర్ల మండలాల నుండి 45 రెవెన్యూ గ్రామాలు రానున్నా యి. మొత్తం 571.83 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సుడా పరిధిలోకి రానుంది. ఏ ఏ ప్రాంతాలను వేటి పరిధిలోకి తీసుకువస్తున్నారు? వేటిని మినహాయిస్తున్నారు? ఎక్కడ రోడ్లను వెడల్పు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు? ఏ యే ప్రాంతాలను పా రిశ్రామిక, కమర్షియల్, రెసిడెన్షియల్ పరిధిలోకి తీసుకువచ్చారు? అనే వాటిపై తీవ్ర మదింపు చేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉ న్నా, ఇందుకు సంబంధించి విషయాలను వివరించేలా మున్సిపాలిటీ కార్యాలయంలో సంబంధిత అధికారులు కనీస ప్రచార చిత్రాలను ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి ఇతర జిల్లాలో మాస్టర్ ప్లాన్ ఆమోదింపచేయటానికి ముందు ఇదే విధానాన్ని అనుసరించానే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇలా చేయ టం వల్ల మాస్టర్ ప్లాన్ లో కి చేర్చబోయే విస్మరించబోయే ప్రాంతాల గురించి ప్రజలు ప్రజలు అవగాహన చేసుకొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.
అయితే అధికారులు ఏదో మొక్కుబడిగా ఓ చిన్న ఫోటోని మునిసిపాలిటీ కార్యాలయం లో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇదేమని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే దాదాపు 570 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను ప్రచార చిత్రాలుగా ఏర్పాటు చేయడం చాలా కష్టమని అందుకే మొత్తం ప్రాంతం ఒకే చిత్రంలో వచ్చేలాగా ఓ గోడ పత్రికను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఇక వీరి తీరు ఇలా ఉంటే మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార శైలి మరోలా ఉంది. మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే ఖమ్మం కా ర్పొరేషన్ ప్రాంతం దాదాపు 72 చదరపు కి లోమీటర్లు ఉంటుందని అంచనా! దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలను ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయవచ్చు.
కానీ కార్పొరేషన్ అధికారులు కనీసం ఆ వైపుగా ఆలోచన చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిని బట్టి ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల చిత్తశుద్ధి ఏ మిటో ఇట్టే అర్థమవుతుంది. వీరి తీరు వల్ల మాస్టర్ ప్లాన్ పై ప్రచారం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని అందువల్లే అభ్యంతరాలు తక్కువ సంఖ్యలో వచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయాన్ని గుంభనంగా ఉంచి ప్లా న్ ఆమోదింప చేసుకున్న తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయితే అప్పు డు పరిస్థితి ఏమిటన్నది నాయకులు, అధికారులకే తెలియాలి.
అధికార పార్టీ నాయకులు అవసరం లేదని భావించారా..?
అటు నియోజకవర్గాల వారీగా చూసుకున్న ఇటు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చూసుకున్న ప్రస్తుతం అధికార పార్టీ నాయకులదే హవా! ప్రజలకు సంబంధించిన విష యాలను అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమైనా, ప్రజలు తమను ఎన్ను కున్నందుకు అధికార పార్టీ నాయకులు ప్లాన్ విషయం భుజాన వేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అయితే అధికార పార్టీ నాయకులకు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏళ్లుగా పెం డింగ్ పడుతూ వస్తున్న మాస్టర్ ప్లాన్ తమ ప్రభుత్వం ఆమోదింప చేసిందనే ప్రతిష్ట పా ర్టీకి రావాలని, దీనిపై అభ్యంతరాలు, వ్యతిరేకత ఎక్కువ రాకుండా చూసుకునే బాధ్య తను రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి నాయకులపై ఉంచారన్న ప్రచారం ఉంది. దీనిని తూచా తప్పకుండా పాటించిన కార్పొరేషన్, కింది స్థాయి నాయకులు ఈ అంశంపై ప్రజలకు లోతైన అవగాహన క ల్పించకుండా వదిలేశారని తె లుస్తోంది. ము ఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏ రోడ్డు ఎంత వెడల్పు కానుంది, రోడ్డు విస్తరణలో తమ ఇళ్ళు ఎంత మేర కోల్పోతున్నారనే విషయం చాలామందికి తెలియదు.
ఈ విషయం పైన అభ్యంతరాలను తెలియజేయావచ్చనే విషయం కూడా ప్రజలకు తె లియదంటే ఆశ్చర్యం కలగక మానదు. అధికార పార్టీ నాయకుల తీరు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులకు గురయ్యేది ప్రజానీకమే! తమకు మేలు చేస్తారని ఓట్లేసి గెలిపించినందుకు అధికార పార్టీ నాయకులు తమకు అవగాహన కల్పించాల్సిన విష యంపై ఎం దుకు గోప్యత పాటిస్తున్నారని ప్రజలు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా స్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుం ది కాబట్టి, వచ్చిన అభ్యంతరాలను మాత్రమే తీసుకుంటారా లేక ప్రజల్లో అవగాహన క ల్పించడంలో అధికారులు విఫలమయ్యారు కాబట్టి, ఈ విషయంపై ప్రజల్లో బాగా చర్చ జరిగేలా చూసి అభ్యంతరాల స్వీకరణకు మరికొంత కాలం గడువు పెంచేలా అధికార పార్టీ నాయకులు ప్రయ త్నం చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.
ఏమీ పట్టని బీఆర్‌ఎస్, బీజేపీ..
ఏవైనా పార్టీలు అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున బలంగా పోరాడుతుంటాయి. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార పార్టీ విఫలమవుతున్న సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ లు మరింత చురుకుగా వ్యవహరించి ప్రజల మద్దతు కూడ కట్టుకునేల వ్యవహరిస్తాయి. కానీ ఖమ్మం పట్టణంలో బీఆర్‌ఎస్, బీజేపీ తీ రు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మాస్టర్ ప్లాన్ పై ప్రజలకు అవగాహన కల్పించలేదని విషయం పై ఈ రెండు పార్టీల నుంచి కనీస స్పందన కరువైందని చెప్పుకోవచ్చు.
అధికారంలో ఎలాగూ లేమనే నిరాశనో లేక గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు తమకు కనీ స సీట్లు కూడా ఇవ్వలేదని కోపమో ఏ మో కానీ ఈ రెండు పార్టీలు ప్రజలపై కినుక వ హించాయా అనే అనుమానాలు రేకెత్తించే లా ఈ పార్టీల వ్యవహారం ఉందనే అభిప్రా యం వ్యక్తం అవుతుంది. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన వివరాలను ప్రజలు ఎవరైనా ఈ రెండు పార్టీల వారిని అడిగితే, దాని పై తమకు అవగాహన లేదనే సమాధానాలను విని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
ఇతర సందర్భాల్లో ఇంటింటికి తిరిగి ప్రచా రం చేసే నాయకులు ఇంత పెద్ద విషయంపై కనీస సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటే, ప్రజల మేలు కోరే విషయంలో పార్టీల చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుందని ఖమ్మం పట్టణ, గ్రామీణ ప్రజానీ కం, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారమేది
చిన్న చిన్న వి షయాలకే హడావిడి చే సే సంబం ధిత అధికారులు ఇంత పెద్ద విషయంలో ప్రచారం కల్పించకపోవ డం వి డ్డూరం. సుడా పరిధిలోకి ఏ ఏ ప్రాంతా లు వస్తున్నాయి? వాటి వల్ల కలిగే మేలు ఇబ్బందులు ఏమిటి? అనే విషయం గ్రామీణ ప్రజలకే కాదు, పట్టణ ప్రజలకు ప్రజానీకానికి కూడా తెలియదు. జిల్లా లో అందరూ చదువుకున్న వారే ఉండ రు. నిరక్షరాస్యులకు కూడా అవగాహన కల్పించి, వారి నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించే విధంగా ఎందుకు ప్ర చారం కల్పించలేదనే విషయం అధికారులకే తెలియాలి.
తాళ్లపల్లి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు, సీపీఎం, ఖమ్మం
మాకు తెలియదు.. ఎవరూ అవగాహన కల్పించలేదు
ఖమ్మానికి మాస్టర్ ప్లాన్ ఆమోదింప చేస్తున్నారని గాని వాటిపైన ఏమైనా అ భ్యంతరాలు ఉంటే తెలియజేయాలనే విషయం పైన మాకు ఎవ రూ అవగాహన కల్పించలే దు. ప్రస్తుతం మేము నివాసం ఉంటు న్న ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయబోతున్నారని, దాని వల్ల మా ఇల్లు కొంత మేర కోల్పోబోతున్నామని చెబుతున్నా రు.
కానీ, ఇది మా స్టర్ ప్లాన్‌లో పొందుపరిచారని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని విషయం మాకుతెలియదు. మా ప్రాం త నాయకులు కూడా ఎవరు దీనిపైన అవగాహన కల్పించలేదు. మా కే కాదు మా ప్రాంతంలో ఎ వరికీ ఈ ఈ విష యం తెలియదు. మా స్టర్ ప్లాన్ వంటి పెద్ద ప్ర ణాళికను అమలులోకి తీ సుకురాబోతున్నప్పుడు ప్రజలకు కనీస అవగాహన కల్పించాలని సోయి నాయకులకు లేకపోవడం దారుణం.
సుంకరి చంద్రశేఖర్, సుందరయ్య నగర్, ఖమ్మం