calender_icon.png 6 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాలల నిర్వహణపై దృష్టి సారించాలి: సీపీఐ

05-08-2025 10:58:06 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పని తీరుపై అధికారులు దృష్టి సారించాలని సీపీఐ మండల అధ్యక్షుడు నరేష్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నాయకులు మంగళవారం ఐసిడిఎస్ అధికారికి ప్రతిపత్రం అందించారు. అంగన్వాడీలలో చాలా సమస్యలు పేరుకుపోయాయన్నారు. గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. అంగన్వాడి సెంటర్స్ టైమింగ్స్ పాటించాలని, గర్భిణి స్త్రీలకు మంత నుంచి పోషికాహారం అందించాలని కోరారు. ఆన్లైన్ అవ్వడం లేదనే సాకుతో గర్భిణీ స్త్రీలకు గుడ్లు, పాలు ఇవ్వడం లేదని, దానిపై చర్యలు చేపట్టాలన్నారు. తదితరు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ అధ్యక్షుడు కార్తీక్, మున్సిప్,  శ్రీకాంత్ పాల్గొన్నారు