06-08-2025 01:07:34 AM
శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’తో తెలుగు ప్రేక్షకులను అందించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ నిర్మించిన ఈ సిరీస్‌కు సూర్యప్రతాప్ ఎస్ షో రన్నర్‌గా వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది.
ఈ క్రమంలో మేకర్స్ సిరీస్ సక్సెస్ మీట్‌ను మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాలాజీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘అన్ని భాషల్లో మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’ అన్నారు. శశికళ మాట్లాడుతూ.. “ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాలాజీ ఈ సిరీస్‌ను 13 రోజుల్లోనే పూర్తిచేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది” అన్నారు. నటుడు శరవణన్, నిర్మాత ప్రభాకరణ్, బిజినెస్ సౌత్ హెడ్ లాయిడ్ జేవియర్ తదితరులు పాల్గొన్నారు.