06-08-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 5 : భాగ్యనగరంలోని హైటెక్ సిటీలో అప్రతిబంధంగా జరిగి న బ్లా స్టింగ్ విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని సుదర్శన్ నగర్‌లో ఉన్న చిరాక్ ఇంటర్నేషన ల్ స్కూల్ పక్కనే వ్రిందవన్ నామిశ్రీ కన్స్ట్రక్ష న్స్ చేపట్టిన సెల్లార్ బ్లాస్టింగ్ స్కూల్ క్లాసు ల్లో విద్యార్థులు ఉండగానే జరగడంతో స్కూల్ ప్రాంగణంలోకి దూసుకువచ్చి పడినట్టు తెలిసింది.
ఈ ఘటనలో ఇద్దరు చిన్నా రులకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధ్వనికి టీచర్లు, సిబ్బంది ఒక్కసారిగా గందరగోళానికి లోనయ్యారు. స్కూల్ యాజమా న్యం తెలిపిన వివరాల మేరకు, ఈ బ్లాస్టిం గ్కు ముం దు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీస భద్రతా చర్యలు పాటించలేదని ఆరోపించా రు. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ స్కూల్ పక్కనే బ్లాస్టింగ్‌లు పేల్చితే భద్రత ఏమైంది? అని నిలదీశారు.
తమ పిల్లలే కాదు& స్కూల్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బందికి కూడా ముందస్తు హె చ్చరిక లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శ నం అన్నారు. ఇంత కీలక ప్రాంతంలో బ్లా స్టింగ్ చేయాలంటే మైనింగ్ శాఖ, జిహెచ్‌ఎం సీ, స్థానిక పోలీస్ స్టేషన్ అనుమతులు తప్పనిసరి. టైమింగ్, డస్ట్ కంట్రోల్, సేఫ్టీ నెట్లు వంటి భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే. కానీ ఈ సంస్థ గతంలోనూ ఇదే విధంగా పలుసార్లు పేలు ళ్లు జరిపినట్టు తెలిసింది.
ఈసారి మాత్రం స్కూల్ భవనం పైనే రాళ్లు పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై స్పందన కోరుతూ గచ్చిబౌలి సీఐకి పలు మార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇది అధికార నిర్లక్ష్యానికి సంకేతమా? లే క నిర్మాణ సంస్థలతో ఉన్న స్నేహ సంబంధాల ఫలితమా? అనే అనుమానాలు జనం మధ్య ఊపందుకుంటున్నాయి. పోలీసులు, సంబంధిత శాఖల వైఖరి తీరుతో బాధితుల నమ్మకమే ప్రశ్నార్థకమవుతోంది.
అయితే క న్స్ట్రక్షన్ యాజమాన్యం మాత్రం ఇలాంటివి సహజమే. మాకు పెద్దవాళ్ల అండ ఉంది. మేము దేనికైనా రెడీ అంటూ పోలీసుల ముందే దురుసుగా ప్రవర్తించింరాని స్కూల్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఘటన అనంతరం అధికారుల విచారణ మొదలైనట్టు తెలుస్తున్నా, బాధ్యత వహించాల్సినవారు మౌనం వహిస్తున్నారు. పిల్లల భద్రతే ప్రశ్నార్థకమయినప్పుడు, తల్లిదండ్రులకు భరోసా ఎలా కలుగుతుంది..? పాలకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం వచ్చిందని పౌర సమాజంగళమెత్తుతోంది.