06-08-2025 12:49:28 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే ఆయనకు మనమందించే ఘన నివాళి అని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశా రు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ర్ట ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమం దిశగా చైతన్యం చేసి, రాష్ర్ట సాధనకోసం అనుసరించాల్సిన వ్యూహాలను అమలు చేశారని గుర్తు చేశారు.
మలి దశ ఉద్యమ పోరాటంలో జయశంకర్ అందించిన స్ఫూర్తి మరువలేనిది అన్నారు. తాను చేపట్టిన ఉద్య మ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు సూచనలు, ఉద్యమ రథ సారధిగా తనకు కొండంత ధైర్యాన్ని అందించినవని కేసీఆర్ తన కృతజ్ఞతా భావన వ్యక్తం చేశారు.