calender_icon.png 6 August, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రహరీలు లేక అవస్థలు కనికరించండి సారూ కాస్త..

06-08-2025 12:26:07 AM

పాఠశాలలోనికి ప్రవేశిస్తున్న జంతువులు, ఆకతాయిలు 

అవస్థలు పడుతున్న విద్యార్థులు 

సమస్య తీర్చాలని వేడుకోలు

నూతనకల్, ఆగస్టు ౫ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తోంది. కానీ కింది స్థాయిలో నిర్లక్ష్యం కారణంగా ఆది నీరు గారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులు కరువవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలోని పలు పాఠశాలల్లో ప్రహరీ లేకపోవడంతో రాత్రి వేళలో అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మద్యం త్రాగి గ్రౌండ్ లోనే బాటిల్ పగలగొట్టి వేయడంతో విద్యార్థులకు గుచ్చుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కొన్ని పాఠశాలల విద్యార్థులు మాత్రం ప్రహరీలు లేక అవస్థ.. కనికరించండి సారు కాస్త.. అంటూ వేడుకుంటున్నారు.

మండలంలో ఇది పరిస్థితి 

మండల వ్యాప్తంగా మొత్తం 35 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 7, ప్రాథమికోన్నత పాఠశాలలు 4, ప్రాథమిక పాఠశాలలు 23, ఒక కేజీబీవీలున్నాయి. వీటిలో కేవలం 27 పాఠశాలలకు మాత్రమే ప్రహరీలు నిర్మించారు. మండలంలోని మిరియాల, పెదనెమిల, లింగంపల్లి ఉన్నత పాఠశాలలో  ప్రహరీలు పాక్షికంగా  ఉన్నాయి. 

హేమ్లతండ, గుండ్ల సింగారం, భాగ్యతండ, శిల్పకుంట్ల, కొత్త తండా ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీ లేకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల ఆవరణలో పందులు,కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. పశువులు, కుక్కలు, పందుల రాకతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే కుక్కల దాడిలో పలువురు విద్యార్థులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి మండలంలోని అన్ని పాఠశాలలకు ప్రహరిలను నిర్మించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

పశువులు తిరుగుతున్నాయి

పాఠశాలకు ప్రహ రీ లేని కారణంగా ఆవరణలో  పశువు లు, వీధి కుక్కలు తిరుగుతున్నాయి. రాత్రివేళలో పాఠశా ల ఆవరణలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. దీంతో పాఠశాల ఆవరణ అప రిశుభ్రంగా మారుతుంది. 

 లింగారెడ్డి ప్రధానోపాధ్యాయుడు, మిర్యాల.

అపరిశుభ్రంగా ఉంటుంది 

పాఠశాలకు ప్రహ రీ లేకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు పాఠశాల ఆవరణలో చేరడంతో అపరిశుభ్రంగా ఉంటుంది,  జిల్లా అధికారులు స్పందించి ఇప్పటికైనా జిల్లా పాఠశాల ప్రహరి నిర్మాణానికి కృషి చేయాలి. 

 కాస అల, విద్యార్థిని, 7వ తరగతి, మిర్యాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా 

మండలంలోని పలు గ్రామాలలోని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం . సమస్యను మరోమారు అధికారులు దృష్టికి తీసుకెల్లి, ప్రహరీల నిర్మా ణానికి కృషి చేస్తాను.

 రాములు నాయక్, ఎంఈఓ