06-08-2025 12:05:28 AM
- పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న అధికారులు టీచర్లు
- జిల్లా విద్యాశాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
- విద్యాశాఖ పనితీరుపై విద్యా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
నిర్మల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే విద్యాశాఖ వివాదాస్పదంగా మారుతుంది. జిల్లాలో విద్యాశాఖ పరిపాలన తీరుపై విద్యా వర్గాల్లో చర్చ జరుగుతుంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ పనితీరులో మార్పు రాకపోగా పరస్పరం ఫిర్యాదులతో పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకోవడం చేరడం విద్యాశాఖకు తీరని మచ్చగా మారుతుంది.
జిల్లా విద్యాశాఖ అధికారి అందులో పని చేసే మరో అధికారి తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేయడం వివాదాలకు మరింత ఆద్యం పోసింది జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ పనితీరు రెండేళ్ల నుంచి ఏదో ఒక అంశం వివాదాస్పదంగా మారడంతో విద్యార్థుల భవిష్యత్తు విద్య అమలు తీరుపై ప్రభావాన్ని చూపెడుతుంది. గత ఏడాది విద్యా శాఖలో పనిచేసే ఉపాధ్యాయులు బిట్కాయిన్ వ్యాపారంలో చిక్కి ఐదుగురు అరెస్టు వరకు వెళ్లడం రాష్ట్రంలోని చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసింది .
జిల్లాలో 756 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇందులో ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో తెలుగు ఇంగ్లీషు ఉర్దూ మరాఠీ మీడియం పాఠశాలలు ఉండగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు సదరు విధులకు హాజరు కాకుండా సంఘాల పేరుతో బయట వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి కలెక్టర్ ఉపాధ్యాయులకు ప్రతిరోజు లైన్ లోకేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవలే దాన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలు ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాల్లో బడులకు డుమ్మా కొడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
విద్యాశాఖ అధికారిపై విమర్శలు
జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి తీరుపై సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుం ది. జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలలను తనిఖీ చేసుకున్నప్పటికీ ఫలితాల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. రెండేళ్లుగా పదవ తరగతిలో నిర్మల్ జిల్లా రాష్ట్రస్థాయిలోని ప్రథమ స్థానంలో నిలపగా ఈ విద్యాశా ఖ అధికారి పని తీరు కారణంగా ఆస్థానం 15కు పడిపోయిందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవలి నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటులో విద్యాశాఖ అధికా రులు నిబంధనలకు వ్యతిరేకంగా సర్దుబాటు ప్రక్రియ వారు అనుకున్న వారికి చేసినట్టు చర్చ జరుగుతుంది. కొందరు ఉపాధ్యాయుల సంఘాల నేతల డిమాండ్ ను బట్టి వారికి అనుకూలమైన టీచర్లకు సర్దుబాటులో అవకాశం కల్పించారు కుంటాల మండలంలోని కల్లూరు లో ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు సర్దుబాటు చేయడంతో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసిన సంగతి తెలిసింది భైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాల పంపడంతో వారు పాఠశాలకు తాళం వేశారు నిర్మల్ మండలంలోని తల్విదా గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతకు నిర్మల్ పట్టణంలోని కస్బా స్కూలుకు డిప్రెషన్ పై ఓరల్ రూపంలో పంపడంతో ఆ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
జిల్లాలో మొత్తం 138 మందిని విద్యా శాఖ సర్దుబాటు చేయగా కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యాశాఖ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఉపాధ్యా యులను వేరే పాఠశాలకు డిప్యూటేషన్ పంపడంపై విమర్శలు వస్తున్నాయి. మారుమూల పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయులు సర్దుబాట్లు బాగుందా మైదాన ప్రాంత పాఠశాలకు డిప్యూటేషన్ లపై పంపడంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా మండిప డుతున్నాయి. కొన్ని సంఘాల ఉపాధ్యాయుల కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని వారు డిఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో బాగానే మూడు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ నేతతో గొడవ జరిగి వివాదం ఏర్పడి పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. ఉపాధ్యాయ సంఘ నేతపై జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయడంతో ఆ నేత తలను కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం విద్యాశాఖ గాడి తప్పుతున్నందుకు ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు.
విద్యాశాఖ అధికారి కూడా కొన్ని విషయాల్లో తాను చెప్పింది విదంగా కొన్ని ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతిరోజు డీఈవో కార్యాల యంలో ఏదో ఒక పంచాయతీ నడుస్తుంది. కేజీబీవీ పాఠశాల తనిఖీల్లో కూడా కొందరికి అన్యాయం చేశారని కొందరు తప్పులు చేసిన పట్టించుకోవడంలేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు
కలెక్టర్ తక్షణం స్పందించాలి
నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరు వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో కావడం తో ఆ ప్రభావం ఆ ప్రభావం అటు ఉపాధ్యాయులపై ఇటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై పడుతుంది. ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులు అందరూ పేద విద్యార్థులకు కావడంతో ప్రభుత్వ పాఠశాల బలోపిత చేసినందుకు జిల్లా కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలి. పాఠశాలలో నిరంతరంగా తనిఖీలు చేస్తున్న కలెక్టర్ అక్కడి లోపాలను గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో కొంత జాప్యం చేయడం వలన విద్యాశాఖలో వివాదాలు రోజురోజుకు వివాదాలు ముదురుతు న్నాయి.
జిల్లా విద్యాశాఖ అధికారి పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సాధించాలి కొందరు ఉపాధ్యాయులు సంఘాల పేరుతో రాజకీయం చేసి విద్యాశాఖను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్న వారిపై దృష్టి సారించి చర్యలకు పూనుకుంటూనే విద్యాశాఖ గాడిలో పడే అవకాశం ఉంది. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న జిల్లా అధికారులతో పాటు కొందరు అధికారు ల తీరుపై కూడా ప్రత్యేక దృష్టి విద్యా శాఖను గాడిలో పెడితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుతున్నారు. అధికా రులు ఏమి స్పందిస్తారో వేచి చూడాల్సిందే.