06-08-2025 12:18:10 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు తన ను బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆపరేషన్ సిం దూర్‌పై జరిగిన చర్చల సందర్భంగా విపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చే శారు.
మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ స మావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిం దూర్‌పై ప్రతిపక్షాల వైఖరి ఏ మాత్రం బాగాలేదన్నారు. ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు తాము అధికారం లో ఉన్నప్పుడు ఏనాడు జమ్మూ కశ్మీర్‌లో దానిని అమలు చేయలేదన్నారు.
తమ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాకా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతోపాటు రామమందిర నిర్మాణం, ఆపరేషన్ సిందూర్ వం టి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు మాత్రం అనవసర చర్యలతో తమను తాము దెబ్బతీసుకుంటున్నాయని పేర్కొన్నా రు. దేశ భద్రత విషయంలో వారి నిర్లక్ష్య ధో రణి.. సొంత పార్టీ నేతల్లోనే అభిప్రాయ భే దాలు బయటపడ్డాయన్నారు.
ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదని తె లిపారు. అంతకుముందు సమావేశంలో భా గంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్, ఆపరేషర్ మహాదేవ్ విజయవం తం కావడంపై తీర్మానాన్ని చదివి వినిపించా రు. ఆపరేషన్ సమయంలో భారత ఆర్మీ చూపించిన తెగువ, పోరాటాన్ని కొనియాడా రు. ఈ సందర్భంగా కూటమి నేతలంతా తీ ర్మానాన్ని ఏకగ్రీకంగా ఆమోదించారు.