30-07-2025 01:45:07 AM
బాధ్యతలు స్వీకరించిన మోరంపూడి
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కమిషనర్‌గా మోరంపూడి అనిల్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఆదా యపు పన్ను శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కమిషనర్‌గా బదిలీపై ఆయన వ చ్చారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐ ఆర్‌ఎస్ అధికారి అనిల్ కుమార్ ప లు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబైల్లో పనిచేశారు. కేరళ, లక్షద్వీప్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వ ర్తించారు. అనిల్‌కుమార్1990వ బ్యాచ్ ఐఆర్‌ఎస్‌కు చెందినవారు. పలు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపు తొమ్మిదేళ్ల తరువా త ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా తెలుగు వ్యక్తి అనిల్‌కుమార్ నియమితులయ్యారు.
కేరళ నుంచి ఏపీ, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతిపై తెలుగురాష్ట్రాలకు వచ్చారు. ఏపీలోని ఏలూరు జిల్లా లింగపాలెంలో గ్రా మంలోని ఓ వ్యవసాయం కుటుంబంలో అనిల్ కుమార్ జన్మించారు. ఆయన కుటుంబం విజయవాడలో స్థిరపడింది.