calender_icon.png 30 July, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

30-07-2025 01:44:04 AM

-రూ. 6.36 లక్షల విలువగల చెక్కులు పంపిణీ

- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో నియోజకవర్గంలోని  గాంధీనగర్, రాంనగర్,  కవాడిగూడ, భోలక్ పూర్ డివిజన్ లలో  దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం 6.36 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహ, వివిధ డివిజన్లో ప్రెసిడెంట్లు రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, కార్యదర్శులు, శ్రీకాంత్, సాయి కృష్ణ, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, మీడియా ఇం చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, ఎస్టీ ప్రేమ్, కేశవపురం అరుణ్, గడ్డ మీద శ్రీనివాస్, గోక నవీన్, ముదిగొండ మురళి, హనుమంతు, కిరణ్ కుమార్, దేవ య్య, సంతోష్, ప్రభాకర్, వేణు, చందు, నితిన్, పాండు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాగదేవత ఆలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పూజలు

నాగుల చవితిని  పురస్కరించుకొని గాం ధీనగర్ డివిజన్ లోని పీపుల్స్ పార్క్ నాగదేవత దేవాలయంలో ముచ్చకుర్తి ప్రభాకర్ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు  నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, ముచ్చ కుర్తి పద్మ ప్రభాకర్, వంశి, రాజేశం, ఆలయ పూజారి శ్రీని వాస్ పెద్ద ఎత్తున మహిళా భక్తులు  పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.