calender_icon.png 10 September, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు..

09-09-2025 06:33:10 PM

మణుగూరు (విజయక్రాంతి): తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ వీరభద్రరావు(Area Incharge General Manager Veerabhadra Rao) అన్నారు. మంగళవారం జిఎం కార్యాలయంలో  ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు  జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని  కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మ విభూషణ్‌ బిరుదుతో గౌరవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. కార్మిక సంఘం నాయకులు మేకల ఈశ్వర్ గా, కృష్ణం రాజు, ఎస్ ఓ టు శ్రీనివాస చారి, అధికారులు రాంబాబు , రమేష్, అనురాధా, శివ ప్రసాద్ శ్రీనివాస్ రావు, జిఎం ఆఫీస్ సిబ్బంది, పాల్గొన్నారు.