09-09-2025 06:46:12 PM
పాల్గొన్న కలెక్టర్, ఎస్పి
కామారెడ్డి (విజయక్రాంతి): తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా కాళోజి నారాయణరావు 111వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కాలోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాళోజి చిత్రపటానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు మాతృ భాషపై కాలోజి నారాయణరావు ఎనలేని కృషి చేశారని అన్నారు. మాతృభాషపై ఉన్న ఆయన అంకితభావం మనందరం మాతృభాషను కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్ డిబిసిడిలో జయరాజ్ అసిస్టెంట్ బి సి డి వో చక్రధర్ సాహితి మిత్రులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, శివరాం, గంగారాం, నాగరాజు, నరేష్, పవన్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.