09-09-2025 06:48:06 PM
మానవహారం నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది..
అర్మూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, దత్తారెడ్డి పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.