22-07-2025 12:42:10 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ప్రముఖ కవి, రచయిత అన్నవరం దేవేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య-2025 సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది దాశరథి పురస్కారం దే వేందర్‌కు వరించింది.. దాశరథి జ యంతిని పురస్కరించుకొని మంగళవారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పురస్కారాన్ని దేవేందర్‌కు ప్రదానం చేయనున్నారు.
అ న్నవరం దేవేందర్ తెలంగాణ సాహి త్యం, సంస్కృతీ, ఉద్యమం, సామాజిక అంశాలపై ఎన్నో రచనలు చేశా రు. మన సంతకం, ఆపతి సంపతి, కట్టమైసమ్మ, పాత కథ (కవితలు) రచయితగా తొవ్వ, మరో కోణం (సామాజిక వ్యాసాలు), నడక, మంక మ్మతోట, లేబర్ అడ్డా, బుడ్డపర్కలు (నానీలు), బొడ్డు మల్లె చెట్టు, పొద్దు పొడుపు, ఫార్మాలాండ్ ఫ్రాగ్రెన్స్ (పీ జయలక్ష్మి రాసిన కలెక్షన్ ఆఫ్ పోయమ్స్‌కు అనువాదం), పొక్కిలి వాకిళ్ల పులకరింత, బువ్వకుండ, ఇంటిదీ పం, వరి గొలుసులు, ఊరి దస్తూరి, గవాయి, జీవన తాత్పర్యం, సంచా రం (యాత్రావ్యాసాలు), అంతరంగం (వర్తమాన జీవన చిత్రన కా లం వ్యాసాలు) తదితర రచనలు చేశారు. వివిధ సంకలనాలకు సంపాదకత్వం వహించారు.