22-07-2025 12:41:43 AM
ముస్తాబాద్, జూలై21(విజయక్రాంతి): ముస్తాబాద్ మండలకేంద్రంలో తహసిల్దార్ కార్యాలయ భవనం పనులను కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝా సోమవారం పరిశీలించా రు. ముస్తాబాద్ మండలకేంద్రంలో కొనసాగుతున్న తహసిల్దార్ కార్యాలయ భవనం పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరంముస్తాబాద్ మండలకేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆద్వర్యంలో ముస్తాబాద్ లో ని రైతు వేదికలో 28 కుట్టు మిషన్లు మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమ వారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
మహిళలు కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి కే కె మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎం సీ చైర్ పర్సన్ తలారి రాణి, తహసిల్దార్ సురేష్ తదితరులుపాల్గొన్నారు.