04-07-2024 01:39:11 AM
నకిలీ దేవుళ్లను అడ్డుకునేందుకు కఠిన చట్టం అవసరం
హథ్రస్ ఘటన బాధాకరం: ఖర్గే
న్యూఢిల్లీ, జూలై 3: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ తొక్కిసలాటపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నకిలీ బాబాలను అరికట్టాలని అన్నారు. రాజ్యసభ తదుపరి సెషన్‌లో హథ్రస్ వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిద్దామన్నారు. ఈ అంశంపై స్పందించాలని కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా స్పందించాలన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చట్టాలు తేవాలన్నారు.