calender_icon.png 20 November, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం షాపులకు మరోసారి లాటరీ

20-11-2025 12:24:09 AM

కలెక్టర్ విజయందిర బోయి

 మహబూబ్ నగర్, నవంబర్ 17 (విజయక్రాంతి): మద్యం షాపుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇటీవల నిర్వహించిన లక్కీ డిపో లో ఓ ఉపాధ్యాయురాలు టెండర్ దాఖలు చేసి విజేతగా నిలిచిన విషయం విధితమే. ఈ తరుణంలో విద్యాశాఖ లకిడిప్పు మద్యం షాపుల్లో పాల్గొన్నందుకు ఆ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. లక్కీ డిప్పులో వచ్చిన మద్యం షాపు తనకు వద్దని తన ఉద్యోగం తనకు ఇవ్వాలని ఆమె దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో లక్కీ డిప్ ద్వారా పొందిన ఆ షాపుకు సంబంధించి జిల్లా కలెక్టర్ విజయందిర బోయి మరో మరు 28 మంది టెండర్ దాఖలు చేసిన అభ్యర్థులకు మరోమారు లక్కీ డిప్ తీయగా 22 నెంబర్  జట్టం శీనుకు ఆ షాపు దక్కింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్, అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి నరసింహ రెడ్డి పాల్గొన్నారు.