calender_icon.png 20 November, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా తాత పేరిట ఉన్న భూములు రైతుల పేరిట చేయండి

20-11-2025 12:22:35 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, నవంబర్ 19 : నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఉదంతపూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించేందుకు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత మంది ఇంటి నిర్మాణానికి పునాదులు వేసుకోగా అవి ఇందిరమ్మ యాప్ లో అప్ లోడ్ కాకపోవడం వల్ల వారికి బిల్లులు ఆగిపోయాయని, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్  ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగిందని,  ఇందిరమ్మ యాప్ లో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను సత్వరమే క్లియర్ చేయాలని సీఎం దృష్టి తీసుకుపోయినట్లు పేర్కొన్నారు. 

 మా తాత పేరిట ఉన్న భూములు రైతుల పేరిట మార్చండి 

రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్ ముఖ్ పేరిట ఉన్న భూమిని రైతుల పేరిట మార్చడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారని, వాటిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి గ కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.