21-09-2025 12:16:32 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వచ్చే వారంలోగా రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటోందని వ్యవసాయ శాఖ తెలిపింది. యూరియా సరఫరాలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థనతో సెప్టెంబర్‌లో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు.
అదనంగా కేటాయించిన యూరి యాలో 60 వేల మెట్రిక్ టన్నులు రవాణా లో ఉండగా, మరో 50 వేల మెట్రిక్ ట న్నులు త్వరలో రాష్ట్రానికి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 1.44 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా సరఫరా అయిందని తెలిపారు. యూరియా సరఫరాలో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా వ్యసాయ శాఖ చర్యలు చేపడుతోందని తెలిపారు.