21-09-2025 12:13:54 AM
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురుస్తాయని సూచించింది. సోమవారం ఆదిలా బాద్ కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, బుధవారం మాత్రం ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ.వేగంతో కూడిన ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.