calender_icon.png 11 December, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే

10-12-2025 02:39:52 AM

  1. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్

ఘనంగా విజయ దివాస్ సంబరాలు

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి చేసిన ఘనత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ముషీరాబాద్  ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో ‘విజయ దివాస్‘  సంబరాలను ఘనంగా నిర్వహించారు.  ముషీరా బాద్ డివిజన్ 44 బస్ స్టాప్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళు లర్పించారు.

నియోజకవర్గంలోని  గాంధీనగర్, కవాడిగూడ,  దోమలగూడ,  రాంనగర్, అడిక్మెట్, ముషీరాబాద్,  భోలక్పూర్ డివిజన్లోని అంబేద్కర్, తెలుగు తల్లి, కేసీఆర్ చిత్రపటాలకు  పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.  నల్లకుంట ప్రభుత్వ పాఠశా లలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. యూపీహెచ్‌సీ సెంటర్లలో గర్భిణీలకు పం డ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఢిల్లీని వణికించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు డిసెంబర్ 9 ’విజయ్ దివస్’ అని పేర్కొన్నారు.

ఈ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెం టులో పోరాడిన తీరును గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జై సింహ, వివిధ డివిజన్ల అధ్యక్షులు, శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, వై.  శ్రీనివాస్ రావు,  కార్యదర్శులు, ఆకుల అరుణ్ కుమార్, శ్రీకాంత్, సాయి కృష్ణ, దామోదర్ రెడ్డి, సురేందర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.