calender_icon.png 13 September, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాకు అనుష్క దూరం

13-09-2025 02:00:24 AM

డిజిటల్ యుగంలో ఎంతో మందిని సామాన్యులను సెలబ్రిటీ లుగా మార్చింది సోషల్ మీడియా. అదే సమయంలో సెలబ్రిటీలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. దాదాపు 6 నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మలయాళ నటి నజ్రియా ఇటీవల ఓనమ్ సందర్భంగా మళ్లీ పోస్ట్ పెట్టింది. టీవీ యాంకర్ రష్మి గౌతమ్ కూడా నెల రోజుల పాటు సోషల్ మీడియాను దూరంగా పెట్టింది.

తాజాగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటిం చింది. తాను నటించిన ‘ఘాటి’ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే స్వీటీ ఈ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాం శమైంది. ఈ సినిమా విడుదల సమయంలో ప్రమోష న్స్‌లో పాల్గొనని అనుష్క లుక్స్‌పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. సన్నగా కనిపించడానికి గ్రాఫిక్స్ వాడారంటూ విమర్శలు వచ్చాయి. అయితే, అనుష్క ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసు కోవటం చర్చనీయాంశమైంది. మరి అనుష్క కమ్‌బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.