calender_icon.png 5 November, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపార్‌ఐడీ జనరేషన్ వందశాతం చేయాలి

05-11-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 4: విద్యార్థులకుఅపార్ ఐడి జనరేషన్ వంద శాతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉ న్నత పాఠశాల ,పోలీస్ లైన్స్ ను సందర్శించారు.పాఠశాలలో ఆపార్ ఐ.డి జనరేషన్ ను కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. అంతకుముందు పత్తి కొనుగోళ్లకు సంబంధించి పూర్తిస్థాయిలో నియమ నిబంధన అమలు చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

పత్తి రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకూడదని రెవెన్యూ సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, తదితరులు ఉన్నారు.