05-11-2025 06:17:26 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..
బాన్సువాడ (విజయక్రాంతి): మత్స్య కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో బుధవారం ఉచిత సబ్సిడీ చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో 26 వేల చెరువులలో రూ.100 కోట్ల రూపాయలతో ఉచిత చేపల పిల్లల విత్తనం వేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బాన్సువాడలో మార్కెటింగ్ భవనం నిర్మించడం జరిగిందన్నారు.
మార్కెటింగ్ కోసం రాయితీ పై వాహనాలను ఇచ్చామన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేపల్లో మంచి ప్రోటీన్ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా కట్ల , రోహు, మ్రిగాల చేప పిల్లలను 1 లక్ష 71 వెయ్యి చేప పిల్లల విత్తనం కల్కి చెరువులో వేయడం జరిగిందన్నారు. మత్స్యకారుల అభివృదే ప్రభుత్వ లక్ష్యమని దళారులను ఆశ్రయించకుండా స్వంతంగా చేపలు అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ట్రైని కలెక్టర్ రవితేజ, మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి, మత్స్య అభివృద్ధి అధికారి నిజాంసాగర్ కే.డోలిసింగ్, మత్స్య క్షేత్ర అధికారి ఏ.ప్రవీణ, మత్స్య శాఖ సహాయకులు, సురేష్, జయరాం, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు పసుపుల పెద్ద సాయిలు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్ శంకర్, సహకార సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి నార్ల సురేష్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.