calender_icon.png 5 November, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టం వివరాలపై ప్రభుత్వానికి నివేదిక

05-11-2025 06:03:57 PM

అచ్చంపేట ఆర్డిఓ మాధవి..

అచ్చంపేట: ఇటీవల కురిసిన వర్షాలతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర వద్ద ఏర్పడిన నష్టం వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అచ్చంపేట ఆర్డిఓ మాధవి తెలిపారు. ఆలయం వద్ద సంభవించిన నష్టం వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు చూపించారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన రిటైలింగ్ వాల్, స్నానపు గదులు, ఆలయం ముందు మడవీధులను ఆమె పరిశీలించారు. నష్టం భారీగా వాటిల్లినట్లు ఆలయ నిర్వాహకులు ఆమెకు తెలియజేశారు. పూర్తి వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని ఆర్డీవో చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు పవన్ కుమార్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.