calender_icon.png 5 November, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 05:48:32 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు శివాలయాలలో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు శివాలయాల్లో, తమ తమ గృహాలలో కార్తీకదీపాలను అలాగే తులసి మాతకు దీపాలను, ఉసిరి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొనకొండ రమేష్ సంధ్య, స్వాములు, కాంతయాచారి ,సత్యనారాయణ ,నిరంజన్రెడ్డి ,శ్రీకాంత్ ,రాము ,సతీష్ మహేష్, బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని స్వరూప రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.