calender_icon.png 5 November, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు... ముగ్గురు మావోయిస్టులు మృతి

05-11-2025 06:10:14 PM

చర్ల: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పరిధిలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్ఠలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టుల మృతిపై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.