05-11-2025 05:38:23 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ రామా కళ్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రమా కల్యాణి మాట్లాడుతూ... మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో లక్షెట్టిపేట గురుకుల నుంచి జమిడి ప్రవళిక అనే విద్యార్థిని 44వ జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. నవంబర్ వరకు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరగబోయే జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారని అన్నారు. ఈ విద్యార్థినికి శిక్షణ ఇచ్చి ప్రొత్సహించిన డి. రమాదేవి, సి.హెచ్.మమత లను ప్రిన్సిపాల్ అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.