05-11-2025 05:57:05 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామ ప్రజల భక్తి శ్రద్ధలతో రామాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతాన్ని భక్తి భావంతో చేసుకున్నారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి కుటుంబం రామాలయ ప్రాంగణాన్ని తీర్థప్రసాదాలతో నింపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సాయి మాట్లాడుతూ “కార్తీక పౌర్ణమి పవిత్రదినం సందర్భంగా భక్తులు ఏకమనసుతో వ్రతం నిర్వహించడం ఆనందదాయకం” అని తెలిపారు.