calender_icon.png 28 November, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడగింపు

28-11-2025 01:17:15 AM

ఖమ్మం, నవంబర్ 27 (విజయ క్రాంతి):డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు డిసెంబర్ 1 వరకు పొడిగించడం జరిగిందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల నందు డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాల వ్యవధి గల కోర్సులలో 30 చోప్పున సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని  అన్నారు.

అర్హు లైన విద్యార్థులలో మొదటి ప్రాధాన్యత బైపిసి విద్యార్థులకు ఉంటుందని, తర్వాత ఎంపిసి, ఇతర విద్యార్థులకు తదుపరి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అభ్యర్థులు ముందుగా https:// tspmb. telangana.gov.in/ నందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని అవసరమైన ధృవపత్రాలతో కలిపి డిసెంబర్ 1న సాయంత్రం ఐదు గంటల లోపు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో సమర్పించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.