calender_icon.png 22 July, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

21-07-2025 07:26:15 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల వారీగా గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు కోరారు. ఖాళీగా ఉన్న సబ్జెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, వాణిజ్య శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, రసాయన శాస్త్రం, గణితం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం బోధించడానికి ఒక్కో సబ్జెక్టులో ఒక్కరికి అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు ఆయా సబ్జెక్టులో 50 శాతం మార్కులతో, ఇతరులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అదనపు అర్హతలు నెట్, స్లేట్, సెట్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈనెల 23 వరకు ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని, 24న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ చెప్పారు. విద్యా అర్హతలు, ఇతర ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీతో కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందజేయాలని కోరారు.