calender_icon.png 2 August, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

01-08-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జూలై- 31(విజయ క్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి  హైదరాబాద్ లోని బేగంపేట, రామంతా పూర్ పబ్లిక్ స్కూల్లలో 1వ తరగతి(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశం కొరకు జిల్లా లోని ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థులు ఆగస్టు 08 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులకు మొత్తము (2) సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

అభ్యర్థి 2018 జూన్ 1 నుండి 2019 మే 31 మధ్యలో జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేల లోపు ఉండాలని, ధృవీకరణ పత్రాలు ఆ దాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారిచే అటేస్టడ్ చేసిన ఆగస్టు 8 సాయంత్రం 5 గంటల లోగా సమీకృత జిల్లా కలెక్టరేట్  లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని,  ఆగస్టు 10 న లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుందని, ఇతర వివరాలకు పెద్దపెల్లి కలెక్టరేట్ లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయం నందు సంప్రదించాలని ప్రకటనలో తెలిపారు.