25-07-2025 12:02:02 AM
నారాయణపేట.జులై 24(విజయక్రాంతి )నారాయణపేట జిల్లాలోని 2025-26సం.గాను జిల్లాలోని బెస్ట్ అవైలెబుల్ స్కూల్స్ లలో మిగిలి పోయిన సీట్ల భర్తీ(అడ్మిషన్)కొరకు అర్హులైన ఎస్సి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధిఖారి కజ్జం ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు.
ధరఖాస్తు చేసుకొనుటకు గాను జులై 25 వ తేదీ నుం డి ఆగష్టు నెలాఖరు వరకు గడువు ఉన్నట్లు గడువులోపు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 1వ తరగతిలో బాలురకు (09) బాలికలకు (03) మరియు 5వ తరగతిలో బాలురకు(13)బాలికలకు(07)సీట్లు మిగినట్లు ఇంతకు పూర్వం కుటుంబంలో బెస్ట్ అవైలెబుల్ స్కూల్ అడ్మిషన్ పొందిన కుటుంబంలోని వారు ఉంటె అట్టి వారు అనర్హులని దరఖాస్తు
దారు యొక్క కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలవారికి 1.50 లక్షలు పట్టణ ప్రాంతాల వారికి రెండు (02) లక్షలు మించరాదని 1వ, తరగతిలో చేరగోరు వారి పుట్టిన తేది1.6.2019 నుండి 31.5.2020లోపు జన్మించిన వారు మాత్రమే అర్హులని, మీసేవ ద్వారాపొందిన భర్త్ సర్టిఫికేట్, కులం ఆదాయం, తదితరదృవపత్రాలు కలిగిఉండి తప్పనిసరిగా దరఖాస్తుకు జతపర్చాలనిఆయనతెలిపారు.