25-07-2025 12:03:44 AM
నారాయణపేట.జులై 24.(విజయక్రాంతి) నారాయణపేట మండలంలో తగినంత యూరి యా అందుబాటులో ఉందని ఎలాంటి యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారి దినకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 2648 బస్తాల యూరియా, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.
రై తులు వారికి అవసరమైన యూరియా మాత్రమే తీసుకోవాలని ఎరువులు తీసుకునేటప్పుడు త ప్పనిసరిగా ఆధార్ కార్డు సమర్పించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్రత్యామ్నాయంగా నానో యూరియా నానో డీఏపీ వంటి ఎరువులను వాడాలని తెలిపారు. ఎవరైనా డీలర్లు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు విక్రయించిన మరియు ఇతర రాష్ట్రాలకు యూ రియా సరఫరా చేసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.