25-08-2025 09:26:59 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలలో కొలువు దీరనున్న గణపతి లకు ఉచితంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గణేష్ మండపానికి ఉచిత లడ్డు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేతుల మీదుగా సోమవారం ముందస్తుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు అందజేశారు. ప్రసాద పంపిణీ కార్యక్రమం ఎంతో మంచి ఆలోచన అని మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన గణేష్ మండపానికి లడ్డు ప్రసాదం పంపిణీ చేయాలని ఎంతో మంచి కార్యక్రమం చేపట్టినట్లు కురుమ సాయిబాబాను ఎమ్మెల్యే మదన్మోహన్ అభినందించారు.