25-08-2025 09:31:22 PM
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి బట్వాన్ పల్లి గ్రామస్తుల వినతి
బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 8 లోని ప్రభుత్వ భూమి అక్రమ పట్టాను శాశ్వతంగా రద్దు చేయాలని బట్వాన్ పల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమెరకు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను కలిసి అక్రమ పట్టాను రద్దు చేయాలని కోరారు. గ్రామ శివారులోని గ్రామచావిడి పరంపోగు ప్రభుత్వ భూమిని బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన దుర్గం ధనుంజయ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని పట్టా చేసుకున్నారని తెలిపారు.
అంతేకాకుండా ఆ స్థలం చుట్టూ కంచెను నిర్మించి ఆ కంచెకు ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుండి అక్రమంగా విద్యుత్ తీసుకుని ప్రజలను చంపేందుకు ప్రయత్నించాడనీ గ్రామస్తులు పేర్కొన్నారు. అక్రమపట్టాను శాశ్వతంగా రద్దు చేసి దుర్గం ధనుంజయ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు.