16 June, 2026 | 2:36 AM

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

16-06-2026 01:28 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ప్రజలు 93 దరఖాస్తులను అందజేశారు.

ప్రజావాణిలో భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, గృహాలు, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ప్రజలు సమర్పించారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్ వి గిరి, జెడ్పి సీఈవో  చందర్ నాయక్, జిల్లా  అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.