calender_icon.png 27 September, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 18లోపు మద్యం షాపుల వేలంలో పాల్గొనటానికి దరఖాస్తులు సమర్పించాలి

27-09-2025 12:46:12 AM

ఖమ్మం, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గలవారు అక్టోబర్ 18 లోపు దరఖాస్తులు దాఖలు చేయాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జి. నాగేంద్ర రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-27 సంవత్సరానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 116 మద్యం షాపుల వేలం కొరకు స్వీకరించే దరఖాస్తులను అక్టోబర్ 18 వరకు స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తుదారుడు మూడు లక్షల రూపాయలను డిడి / చలాన్ రూపేన చెల్లించాలని, ఈ సొమ్ము తిరిగి చెల్లించబడవని అన్నారు.

దరఖా స్తుదారుడు జిల్లా మద్యపాన నిషేధ అధికారి, ఖమ్మం పేరిట డిడి తీయాలని, దరఖాస్తుతో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ, కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలని, దరఖాస్తులను ఖమ్మం కొత్త కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న ఎక్సైజ్ స్టేషన్ నందు సమర్పించాలని ఆయన తెలిపారు. మద్యం షాపుల దరఖాస్తులను ఖమ్మం లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ నందు అక్టోబర్ 23న ఉదయం 11.00 గంటలకు డ్రా ద్వారా కేటాయించడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు..